యోనా సూచన
29 జనుల గుంపులు పెరుగుతూ ఉండగా యేసు, "ఇది దుష్టతరము. వీరు సూచనను అడుగుతున్నారు కానీ వీరికి యోనా సూచన తప్ప మరి ఏ సూచన ఇవ్వబడదు. 30 నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండునట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు. 32 నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా, ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె ప్రజలు న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు" అని చెప్పారు.