Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 11:5-8

OTSA Telugu Contemporary Version

5,6 ఆ తర్వాత యేసు వారితో, "మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి, నీవు అర్థరాత్రి సమయంలో అతని దగ్గరకు వెళ్లి, ‘స్నేహితుడా, నా స్నేహితుడొకడు ప్రయాణం చేస్తూ, నా దగ్గరకు వచ్చాడు, వానికి పెట్టడానికి నా దగ్గర ఆహారమేమి లేదు కాబట్టి నాకు మూడు రొట్టెలిస్తావా?’ అని అడిగితే; 7 లోపల ఉన్నవాడు, ‘నన్ను ఇబ్బంది పెట్టకు, తలుపుకు తాళం వేసి ఉంది. నేను నా పిల్లలు పడుకున్నాము. నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను?’ అని అన్నాడనుకోండి. 8 నేను చెప్తున్న, మీకున్న స్నేహాన్ని బట్టి అతడు లేచి నీకు రొట్టె ఇవ్వకపోయినా, నీవు అంతగా సిగ్గువిడిచి అడిగావు కాబట్టి11:8 లేదా తన మంచి పేరు కాపాడుకోడానికైనా అతడు తప్పక లేచి, నీకు అవసరమైనంత ఇస్తాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    5 తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు. "మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. అర్థరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ‘మిత్రమా, నాకు మూడు రొట్టెలు బదులివ్వు. 6 నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ దారిలో నా దగ్గరికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు’ అని చెప్పారనుకోండి. 7 అతడు లోపలే ఉండి, ‘నన్ను తొందర పెట్టవద్దు. తలుపు వేసేశాను. చిన్న పిల్లలు నిద్ర పోతున్నారు. నేను లేచి ఇవ్వలేను’ అని చెబుతాడా?

    8 మీరు తన స్నేహితుడని కాకపోయినా సిగ్గు విడిచి అదేపనిగా అడగడం వల్లనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెబుతున్నాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.