9 "అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. 10 అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.
11 "మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప11:11 కొ.ప్ర.లలో రొట్టె అడిగితే, అతనికి రాయి ఇస్తాడా? అడిగితే పాము ఇస్తారా? 12 వాడు గ్రుడ్డు అడిగితే తేలు ఇస్తాడా? 13 మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!"