7 సత్రంలో వారికి స్థలం దొరకలేదు, కాబట్టి ఆమె ఆ శిశువును మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది.
24 ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా: "గువ్వల జతను, లేదా రెండు చిన్న పావురాలను"2:24 లేవీ 12:8 బలిగా అర్పించడానికి తీసుకెళ్లారు.
34 సుమెయోను వారిని దీవించి ఆయన తల్లియైన మరియతో: "ఇశ్రాయేలీయులలో అనేకమంది పడిపోవడానికి లేవడానికి కారణంగాను, వ్యతిరేకంగా చెప్పుకోడానికి గుర్తుగాను ఉండడానికి ఈ శిశువు నియమించబడ్డాడు, 35 తద్వారా అనేకమంది హృదయాలోచనలు బయలుపరచబడతాయి, నీ హృదయంలోకి కూడా ఒక ఖడ్గం దూసికొనిపోతుంది."