31 "సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు. 32 కానీ నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని నేను నీకోసం ప్రార్థించాను. అయితే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు" అని చెప్పారు.
33 కానీ పేతురు, "ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే" అన్నాడు.
34 అందుకు యేసు, "పేతురూ, ఈ రోజే కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో చెప్తున్నాను" అన్నారు.
యేసును నిరాకరించిన పేతురు
54 వారు యేసును బంధించి, ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు పేతురు దూరం నుండి వారిని వెంబడించాడు. 55 అక్కడ కొందరు ప్రాంగణం మధ్యలో మంటలు వేసి, కలిసి కూర్చున్నప్పుడు, పేతురు వారితో కూర్చున్నాడు. 56 అప్పుడు ఆ మంట వెలుతురులో ఒక దాసియైన అమ్మాయి అతన్ని తేరి చూసి, "ఇతడు కూడా అతనితో ఉన్నవాడే" అన్నది.
57 పేతురు దానిని నిరాకరించి, "అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు" అన్నాడు.
58 కొంతసేపు తర్వాత ఇంకొకడు అతన్ని చూసి, "నీవు కూడా వారిలో ఒకడివి" అన్నాడు.
పేతురు, "నేను కాదు!" అన్నాడు.
59 ఇంచుమించు ఒక గంట సమయం తర్వాత మరొకడు, "వీడు గలిలయుడే, నిజంగానే వీడు కూడా అతనితో ఉన్నవాడే" అన్నాడు.
60 అందుకు పేతురు, "నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు" అని చెప్తుండగానే కోడి కూసింది. 61 అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశారు అప్పుడు పేతురు, "కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు" అని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని,