Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 22:39-46

యేసు ఒలీవల కొండపై ప్రార్థించుట

39,40 భోజనమైన తర్వాత ఆయన బయలుదేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్లారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. వారు అక్కడ చేరిన తర్వాత, ఆయన వారితో, "మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయండి" అని చెప్పారు. 41 అలా చెప్పి వారి నుండి ఒక రాయి విసిరేంత దూరం వెళ్లి, మోకరించి ఇలా ప్రార్థించారు: 42 "తండ్రీ, నీ చిత్తమైతే, ఈ గిన్నెను నా నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే చేయి." 43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. 44 ఆయన బహు వేదనతో, మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేల మీద పడుతూ ఉంది.

45 ఆయన ప్రార్థనలో నుండి లేచి శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, వారు దుఃఖంతో అలసి, నిద్రిస్తున్నారని చూశారు 46 ఆయన వారితో, "మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలో పడిపోకుండా లేచి ప్రార్థన చేయండి" అని చెప్పారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.