పస్కా పండుగ భోజన ఏర్పాటు
7 పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, 8 యేసు పేతురు యోహానును పిలిచి, "మీరు వెళ్లి మనం పస్కాను భుజించడానికి సిద్ధం చేయండి" అని పంపారు.
14 వారు పస్కా భుజించే సమయం వచ్చినపుడు, ఆయన తన అపొస్తలులతో భోజనబల్ల దగ్గర కూర్చున్నారు. 15 ఆయన వారితో, "నేను శ్రమను అనుభవించక ముందు ఈరీతిగా మీ అందరితో కలిసి ఈ పస్కా విందును భుజించాలని ఎంతో ఆశించాను.
19 ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, "ఇది మీ కోసం ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి" అని చెప్పారు.
20 అలాగే, భోజనమైన తర్వాత, ఆయన పాత్రను తీసుకుని, "ఈ పాత్ర మీ కోసం చిందించనున్న నా రక్తంలో క్రొత్త నిబంధన.