Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 23:13-25

13 తర్వాత పిలాతు ముఖ్య యాజకులను, అధికారులను ప్రజలను పిలిపించి, 14 "ప్రజలను తిరుగుబాటు చేయిస్తున్నాడు అని మీరు ఈ మనుష్యుని నా దగ్గరకు తీసుకువచ్చారు. నేను మీ ముందే ఇతన్ని విచారించాను కానీ మీరు అతని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా ఇతనిలో నాకు కనబడలేదు. 15 హేరోదుకు కూడా అతనిలో ఏ నేరం కనబడలేదని మరలా నా దగ్గరకు పంపించాడు; ఇదిగో, ఈయన మరణానికి తగిన నేరమేమి చేయలేదు. 16 కాబట్టి నేను ఇతనికి శిక్షించి విడుదల చేస్తాను" అని వారితో చెప్పాడు. 17 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి.23:17 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు

18 అయితే వారందరు, "ఇతన్ని చంపి! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!" అని కలిసికట్టుగా కేకలు వేశారు. 19 ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు చేసినందుకు హత్య చేసినందుకు చెరసాలలో పెట్టబడ్డాడు.

20 పిలాతు యేసును విడుదల చేయాలని, వారికి తిరిగి విజ్ఞప్తి చేశాడు. 21 కానీ వారు, "వీనిని సిలువ వేయండి! సిలువ వేయండి!" అని కేకలు వేశారు.

22 మూడవసారి అతడు వారితో, "ఎందుకు? ఈ మనిషి చేసిన నేరమేంటి? ఇతనికి మరణశిక్షను విధించదగిన నేరమేమి నాకు కనబడలేదు. కాబట్టి ఇతన్ని శిక్షించి వదిలేస్తాను" అని వారితో చెప్పాడు.

23 కాని వారు ఇంకా గట్టిగా కేకలువేస్తూ ఆయన సిలువవేయబడాలని పట్టుబట్టారు, చివరికి వారి కేకలే గెలిచాయి. 24 కాబట్టి పిలాతు వారు కోరినట్లే చేయడానికి నిర్ణయించాడు 25 వారు కోరుకున్న విధంగా తిరుగుబాటు హత్యానేరాలతో చెరసాలలో ఉన్న బరబ్బాను వారికి విడుదల చేసి, యేసును వారి ఇష్టానికి అప్పగించాడు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.