Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 4:1-13

అరణ్యంలో యేసును శోధించి ఓడిన సాతాను

1 యేసు, పరిశుద్ధాత్మపూర్ణుడై, యొర్దానును విడిచి వెళ్లారు. ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు. 2 అక్కడ నలభై రోజులు ఆయన అపవాది చేత శోధించబడ్డారు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు, ఆ రోజులు పూర్తి అవుతుండగా ఆయనకు ఆకలివేసింది.

3 అపవాది ఆయనతో, "నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు" అని అన్నాడు.

4 అందుకు యేసు, " ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’4:4 ద్వితీ 8:3 అని వ్రాయబడి ఉంది" అని జవాబిచ్చారు.

5 తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ ఆయనకు చూపించాడు. 6 అపవాది ఆయనతో, "వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను. 7 నీవు నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను" అన్నాడు.

8 అందుకు యేసు, " ‘నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి4:8 ద్వితీ 6:13’ అని వ్రాయబడి ఉంది" అని జవాబిచ్చారు.

9 అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, "నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడినుండి క్రిందికి దూకు. 10 ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:

" ‘నిన్ను జాగ్రత్తగా కాపాడడానికి నీ గురించి

ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు;

11 నీ పాదాలకు ఒక రాయి తగలకుండ,

వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’ "4:11 కీర్తన 91:11-12 అని అన్నాడు.

12 అందుకు యేసు, " ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది"4:12 ద్వితీ 6:16 అని అన్నారు.

13 అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.