16 యేసు తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్లినప్పుడు, అలవాటు ప్రకారం సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి, వాక్యాన్ని చదవడానికి నిలబడ్డారు. 17 ఆయన చేతికి ప్రవక్తయైన యెషయా వ్రాసిన గ్రంథాన్ని వారు అందించారు. ఆయన ఆ గ్రంథపుచుట్టను విప్పుతుండగా ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉండడం కనిపించింది:
18 "ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది,
బీదలకు సువార్త ప్రకటించడానికి,
ఆయన నన్ను అభిషేకించారు;
చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి,
గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి,
బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి,
19 ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు."4:19 యెషయా 61:1,2; యెషయా 58:6
20 ఆ తర్వాత ఆ గ్రంథపుచుట్టను చుట్టి, అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజమందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మీద దృష్టి సారించారు. 21 అప్పుడు ఆయన వారితో, "ఈ రోజు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది" అన్నారు.