Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 9:57-62

OTSA Telugu Contemporary Version

యేసును వెంబడించుటకు చెల్లించవలసిన వెల

57 వారు దారిన వెళ్తున్నప్పుడు, ఒకడు ఆయనతో, "నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను" అని అన్నాడు.

58 అందుకు యేసు, "నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి, కాని మనుష్యకుమారునికి తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు" అని అతనితో చెప్పారు.

59 ఆయన ఇంకొకనితో, "నన్ను వెంబడించు" అన్నారు.

అందుకు అతడు, "ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నన్ను వెళ్లనివ్వు!" అని అన్నాడు.

60 యేసు అతనితో, "చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకుంటారు, నీవైతే వెళ్లి దేవుని రాజ్యం గురించి ప్రకటించు" అని చెప్పారు.

61 ఇంకొకడు ఆయనతో, "ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను; కానీ మొదట నేను వెళ్లి నా కుటుంబీకులకు వెళ్తున్నానని చెప్పి వస్తా" అన్నాడు.

62 అందుకు యేసు వానితో, "నాగలిపై చేయి వేసాక వెనుకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు" అని అన్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    57 వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి, "నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను" అని ఆయనతో అన్నాడు. 58 అందుకు యేసు, "నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు" అని అతనికి చెప్పాడు.

    59 ఆయన మరో వ్యక్తిని చూసి "నా వెంట రా" అన్నాడు. ఆ వ్యక్తి, "ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి" అన్నాడు. 60 అందుకాయన, "చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు" అని అతనితో చెప్పాడు.

    61 మరొకడు, "ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి" అన్నాడు. 62 దానికి యేసు, "నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు" అని వాడితో చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.