Pular para o conteúdo
Publicidade

విలాప 3:1-9

1 యెహోవా ఉగ్రత కర్ర చేత

నేను బాధను అనుభవించిన వాన్ని.

2 ఆయన నన్ను వెళ్లగొట్టి,

వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు.

3 నిజానికి, ఆయన రోజంతా

మాటిమాటికి నా మీద తన చేయి ఆడిస్తానే ఉన్నారు.

4 ఆయన నా చర్మాన్ని, నా మాంసాన్ని క్షీణించిపోయేలా చేసి

నా ఎముకలను విరగ్గొట్టారు.

5 ఆయన నన్ను ముట్టడించి,

విషంతో కఠినత్వంతో నన్ను చుట్టుముట్టారు.

6 ఎప్పుడో చనిపోయినవారు పడి ఉన్నట్లుగా

ఆయన నన్ను చీకటిలో పడి ఉండేలా చేశారు.

7 నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు;

బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు.

8 నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా

ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు.

9 ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు;

ఆయన నా మార్గాలను వంకర చేశారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Lamentações
Ver todos os capítulos de Lamentações