17 సమాధానం నాకు దూరమైంది,
అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను.
18 కాబట్టి, "నా వైభవం పోయింది,
యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి" అని నేనన్నాను.
19 నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి,
నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి.
20 నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను,
నా ప్రాణం నాలో కృంగి ఉంది.