21 అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను,
కాబట్టి నాకు నిరీక్షణ ఉంది:
22 యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు,
ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.
23 ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి;
మీ నమ్మకత్వం గొప్పది.
24 నాలో నేను, "యెహోవా నా స్వాస్థ్యం;
కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను"
అని అనుకుంటున్నాను.