Pular para o conteúdo
Publicidade

లేవీయ 15:25-27

OTSA Telugu Contemporary Version

25 " ‘ఒక స్త్రీకి తన నెలసరి సమయం కాకుండా చాలా రోజులు రక్తస్రావం జరిగినా లేదా ఆమె నెలసరి వ్యవధి మించి రక్తస్రావం కొనసాగితే, రక్తస్రావం ఉన్నంత వరకు నెలసరి రోజుల్లా ఆమె అపవిత్రంగా ఉంటుంది. 26 ఆమెకు రక్తస్రావం కొనసాగుతున్నప్పుడు ఆమె పడుకున్న ఏ పడకైనా ఆమె నెలసరి సమయంలో ఉన్నప్పటిలాగే ఆ పడక అపవిత్రం, అలాగే ఆమె దేనిపై కూర్చున్న అది అపవిత్రం అవుతుంది. 27 వాటిని తాకినవారు అపవిత్రులు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    25 ఒక స్త్రీకి తన బహిష్టు సమయంలో కాకుండా అనేకరోజులు రక్త స్రావం జరుగుతూ ఉన్నా, లేదా బహిష్టు సమయం దాటిన తరువాత కూడా స్రావం జరుగుతూనే ఉన్నా స్రావం జరిగినన్ని రోజులూ ఆమెకు బహిష్టు సమయం లానే ఉంటుంది. ఆమె అశుద్ధురాలుగానే ఉంటుంది. 26 ఆమెకు స్రావం జరుగుతున్న రోజులన్నీ ఆమె పండుకునే మంచం ఆమె బహిష్టు సమయంలో పండుకునే మంచం లాగే ఉంటుంది. ఆమె దేని పైన కూర్చుంటుందో ఆమె బహిష్టు సమయంలో జరిగినట్టే అది అశుద్ధం అవుతుంది. 27 వీటిని ముట్టుకునే వాడు అశుద్ధుడు. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.