రాజుగా యెరూషలేముకు వచ్చిన యేసు
1 వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ, బేత్పగే గ్రామాలకు వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, 2 "మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడకు తీసుకురండి.
7 వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరకు తీసుకువచ్చి దానిపై తమ వస్త్రాలను వేశారు, ఆయన దానిపై కూర్చున్నారు. 8 చాలామంది ప్రజలు తమ వస్త్రాలను త్రోవలో పరిచారు, మరికొందరు పొలాల్లో నుండి కొమ్మలు నరికితెచ్చి పరిచారు. 9 ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా,
"హోసన్నా!"
"ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!"11:9 కీర్తన 118:25-26
10 "రానైయున్న మన పితరుడైన దావీదు రాజ్యం ధన్యమవును గాక!"
"సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!"
అని కేకలు వేశారు.
11 యేసు యెరూషలేములో ప్రవేశించి, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లారు. అక్కడ ఉన్నవాటన్నిటిని చూశారు కాని అప్పటికే ఆలస్యం అయినందుకు ఆయన పన్నెండు మందితో కలిసి బేతనియ గ్రామానికి వెళ్లిపోయారు.