కైసరుకు పన్ను చెల్లించుట
13 తర్వాత వారు యేసును ఆయన మాటల్లోనే పట్టించాలని కొంతమంది పరిసయ్యులను హేరోదీయులను ఆయన దగ్గరకు పంపారు. 14 వారు యేసు దగ్గరకు వచ్చి, "బోధకుడా, నీవు యథార్థవంతుడవని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు; కాని సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?"
17 అప్పుడు యేసు, "కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి" అని వారితో చెప్పారు.
ఆయన జవాబుకు వారు చాలా ఆశ్చర్యపడ్డారు.
పునరుత్థానంలో పెళ్ళి
18 అప్పుడు పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు.
గొప్ప ఆజ్ఞ
28 ధర్మశాస్త్ర ఉపదేశకులలో ఒకడు వచ్చి వారు తర్కించుకోవడం విన్నాడు. యేసు వారికి మంచి జవాబు ఇవ్వడం గమనించి, "ఆజ్ఞలన్నిటిలో అతి ముఖ్యమైనదేది?" అని ఆయనను అడిగాడు.
29 అందుకు యేసు, "అన్నిటిలో అతి ముఖ్యమైనది: ‘ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన ప్రభువైన దేవుడు, ప్రభువు ఒక్కరే. 30 మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణబలంతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’12:30 ద్వితీ 6:4,5 31 రెండవ ఆజ్ఞ: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’12:31 లేవీ 19:18 వీటిని మించిన గొప్ప ఆజ్ఞ లేదు" అని అతనితో చెప్పారు.