యేసు బంధించబడుట
43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది.
మహాసభ ముందు యేసు
53 వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకెళ్లారు, ముఖ్య యాజకులు, నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరు అక్కడ సమావేశం అయ్యారు.
55 ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వెదకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకలేదు.
61 కాని యేసు మౌనంగా ఉండి వారికి ఏ జవాబు ఇవ్వలేదు.
ప్రధాన యాజకుడు మళ్ళీ యేసును, "నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా?" అని అడిగాడు.
62 అందుకు యేసు, "అవును" అంతేకాదు, "మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు" అని చెప్పారు.
63,64 అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, "ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?" అని అడిగాడు.
అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు. 65 ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయడం మొదలుపెట్టారు; వారు ఆయన కళ్లు మూసి, ఆయనను తమ పిడికిళ్ళతో గుద్ది, "నిన్ను ఎవరు కొట్టారో, చెప్పు!" అన్నారు. కావలివారు కూడా ఆయనను పట్టుకుని కొట్టారు.