Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 3:13-19

పన్నెండుమందిని నియమించిన యేసు

13 ఆ తర్వాత యేసు కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలిచారు, వారు ఆయన దగ్గరకు వచ్చారు. 14 తనతో ఉండడానికి, ప్రకటించడానికి తాను బయటకు పంపడానికి ఆయన పన్నెండుమందిని3:14 కొ.ప్ర.లలో పన్నెండుమందిని అపొస్తలులుగా నియమిస్తూ నియమించుకొని 15 దయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్ని వారికిచ్చారు.

16 ఆ పన్నెండుమంది ఎవరనగా:

ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను,

17 జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను; (వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అనే పేరు పెట్టారు; దాని అర్థం "ఉరుము కుమారులు"),

18 అంద్రెయ,

ఫిలిప్పు,

బర్తలోమయి,

మత్తయి,

తోమా,

అల్ఫయి కుమారుడు యాకోబు,

తద్దయి,

అత్యాసక్తి కలవాడైన సీమోను,

19 ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.