Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 3:31-35

OTSA Telugu Contemporary Version

31 ఆ తర్వాత యేసు తల్లి సహోదరులు వచ్చారు. వారు బయట నిలబడి, ఆయనను పిలువడానికి ఒకరిని లోపలికి పంపారు. 32 జనసమూహం ఆయన చుట్టూ కూర్చుని ఉండగా, వారు ఆయనతో, "నీ తల్లి నీ సహోదరులు నిన్ను కలువడానికి వచ్చి బయట వేచి ఉన్నారు" అని చెప్పారు.

33 అందుకు ఆయన, "నా తల్లి నా సహోదరులు ఎవరు?" అని అడిగారు.

34 ఆయన తన చుట్టూ కూర్చున్న వారిని చూసి, "వీరే నా తల్లి, నా సహోదరులు! 35 దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి" అని చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    31 అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు. యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. 32 వారు ఆయనతో, "నీ తల్లి, సోదరులు బయట నీ కోసం చూస్తున్నారు" అన్నారు. 33 ఆయన వారితో, "ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?" అన్నాడు. 34 తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, "ఇదిగో నా తల్లి, నా సోదరులు. 35 ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి" అని అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.