6 అందుకు ఆయన వారితో, "వేషధారులారా, మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే; అక్కడ వ్రాయబడి ఉన్నట్లు:
" ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు
కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి.
7 వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు;
వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’7:7 యెషయా 29:13
8 మీరు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం విడిచిపెట్టి మానవ ఆచారాలకు కట్టుబడి ఉన్నారు" అన్నారు.