Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 9:42-48

ఆటంకం కలిగిస్తే

42 "ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే, వారి మెడకు తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు. 43 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ చేయి కారణమైతే, దానిని నరికి పారవేయి. ఎందుకంటే నీవు రెండు చేతులు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, ఒక చేతితో నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. 44 ఆ నరకంలో,

" ‘వారిని తినే పురుగులు చావవు

అగ్ని ఆరదు.’9:44 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు

45 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దానిని నరికి పారవేయి. నీవు రెండు కాళ్లు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. 46 ఆ నరకంలో,

" ‘వారిని తినే పురుగులు చావవు

అగ్ని ఆరదు.’9:46 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు

47 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీవు రెండు కళ్లు కలిగి నరకంలో పడవేయబడటం కంటే, ఒక కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మేలు. 48 ఆ నరకంలో,

" ‘వారిని తినే పురుగులు చావవు,

అగ్ని ఆరదు.’9:48 యెషయా 66:24

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.