Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 1:1-17

యేసు క్రీస్తు వంశావళి

1 ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు1:1 క్రీస్తు లేదా మెస్సీయా అంటే అభిషిక్తుడు యేసు వంశావళి:

2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు,

ఇస్సాకు కుమారుడు యాకోబు,

యాకోబు కుమారులు యూదా అతని సహోదరులు.

3 యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు.

పెరెసు కుమారుడు హెస్రోను,

హెస్రోను కుమారుడు అరాము.1:3 ప్రా.ప్ర.లలో రాము అలాగే; 1 దిన 2:9-10

4 అరాము కుమారుడు అమ్మీనాదాబు,

అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను,

నయస్సోను కుమారుడు శల్మాను.

5 శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు,

బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు,

ఓబేదు కుమారుడు యెష్షయి.

6 రాజైన దావీదు యెష్షయి కుమారుడు.

దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.

7 సొలొమోను కుమారుడు రెహబాము,

రెహబాము కుమారుడు అబీయా,

అబీయా కుమారుడు ఆసా.

8 ఆసా కుమారుడు యెహోషాపాతు,

యెహోషాపాతు కుమారుడు యెహోరాము,

యెహోరాము కుమారుడు ఉజ్జియా.

9 ఉజ్జియా కుమారుడు యోతాము,

యోతాము కుమారుడు ఆహాజు,

ఆహాజు కుమారుడు హిజ్కియా.

10 హిజ్కియా కుమారుడు మనష్షే,

మనష్షే కుమారుడు ఆమోను,

ఆమోను కుమారుడు యోషీయా.

11 యోషీయా కుమారులెవరనగా యెకొన్యా1:11 అంటే యెహోయాకీను; 12వచనంలో కూడా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.

12 బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే:

యెకొన్యా కుమారుడు షయల్తీయేలు,

షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.

13 జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు,

అబీహూదు కుమారుడు ఎల్యాకీము,

ఎల్యాకీము కుమారుడు అజోరు.

14 అజోరు కుమారుడు సాదోకు,

సాదోకు కుమారుడు ఆకీము,

ఆకీము కుమారుడు ఎలీహూదు.

15 ఎలీహూదు కుమారుడు ఎలియాజరు,

ఎలియాజరు కుమారుడు మత్తాను,

మత్తాను కుమారుడు యాకోబు.

16 యాకోబు కుమారుడైన యోసేపు మరియకు భర్త. ఆమె యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి.

17 ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు, చెరకు కొనిపోబడినప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.