3 యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు.
పెరెసు కుమారుడు హెస్రోను,
హెస్రోను కుమారుడు అరాము.1:3 ప్రా.ప్ర.లలో రాము అలాగే; 1 దిన 2:9-10
5 శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు,
బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు,
ఓబేదు కుమారుడు యెష్షయి.
6 రాజైన దావీదు యెష్షయి కుమారుడు.
దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.
16 యాకోబు కుమారుడైన యోసేపు మరియకు భర్త. ఆమె యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి.