Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 12:46-50

OTSA Telugu Contemporary Version

యేసు తల్లి తమ్ముళ్ళు

46 యేసు ఆ జనసమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు. 47 అది చూసిన ఒకడు ఆయనతో, "నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచి ఉన్నారు" అని చెప్పాడు.

48 అందుకు యేసు అతనికి, "నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు?" అని చెప్పి 49 తన శిష్యులను చూపిస్తూ, "వీరే నా తల్లి, నా సహోదరులు. 50 ఎందుకంటే నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి" అని జవాబిచ్చారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    46 ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు. 47 అప్పుడొకడు, "నీ తల్లీ నీ సోదరులూ నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు" అని ఆయనతో చెప్పాడు. 48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి, "నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?" అని చెప్పి 49 తన శిష్యులవైపు చెయ్యి చాపి, "నా తల్లి, నా సోదరులు వీరే! 50 నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.