Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 15:3-9

3 అప్పుడు యేసు వారితో ఈ విధంగా చెప్పారు, "మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు? 4 ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.15:4 నిర్గమ 21:12; ద్వితీ 5:16 ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే వారికి మరణశిక్ష విధించాలి’15:4 నిర్గమ 21:17; లేవీ 20:9 అని దేవుడు చెప్పారు. 5 కానీ మీరు, ఎవరైనా తమ తండ్రితో గాని తల్లితో గాని సహాయపడడానికి ఉపయోగించినది ‘దేవునికి అంకితం’ అని ప్రకటిస్తే, 6 వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీ సంప్రదాయం కోసం దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. 7 వేషధారులారా! మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే:

8 " ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు

కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి;

9 వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు;

వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ "15:9 యెషయా 29:13

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.