Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 16:13,16,21-24,28

యేసే క్రీస్తు అని తెలియజేసిన పేతురు

13 యేసు కైసరయ ఫిలిప్పు ప్రాంతానికి వచ్చినప్పుడు, "మనుష్యకుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?" అని తన శిష్యులను అడిగారు.

16 అందుకు సీమోను పేతురు, "నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు" అని చెప్పాడు.

తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు

21 అప్పటినుండి యేసు తాను యెరూషలేము పట్టణానికి వెళ్లి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని తన శిష్యులకు వివరించడం మొదలుపెట్టారు.

22 అప్పుడు పేతురు, "ప్రభువా, అది నీ నుండి దూరమగు గాక, అలా నీకు ఎన్నడు జరుగకూడదు!" అని ఆయనను ప్రక్కకు తీసుకెళ్లి గద్దింపసాగాడు.

23 అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి, "సాతానా, నా వెనుకకు పో! నీవు నాకు ఆటంకంగా ఉన్నావు; నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు ఉన్నాయి" అన్నారు.

24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి, "ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి.

28 "ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యంతో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను" అన్నారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.