Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 16:13-16

OTSA Telugu Contemporary Version

యేసే క్రీస్తు అని తెలియజేసిన పేతురు

13 యేసు కైసరయ ఫిలిప్పు ప్రాంతానికి వచ్చినప్పుడు, "మనుష్యకుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?" అని తన శిష్యులను అడిగారు.

14 వారు ఆయనతో, "కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని, కొందరు ఏలీయా అని, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారని" జవాబిచ్చారు.

15 అయితే ఆయన వారిని, "మరి మీరు ఏమనుకుంటున్నారు?" అని అడిగారు.

16 అందుకు సీమోను పేతురు, "నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు" అని చెప్పాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    13 యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, "మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?" 14 వారు, "కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు" అన్నారు. 15 "అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?" అని వారిని అడిగాడు. 16 వెంటనే సీమోను పేతురు, "నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!" అని చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.