Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 18:1-4

OTSA Telugu Contemporary Version

పరలోకరాజ్యంలో ఎవరు గొప్ప

1 ఆ సమయంలోనే శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, "పరలోకరాజ్యంలో అందరికంటే గొప్పవాడెవరు?" అని అడిగారు.

2 అప్పుడు యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలుచుకొని వారి మధ్యలో నిలబెట్టి ఈ విధంగా చెప్పారు, 3 "మీరు ఈ చిన్నపిల్లలవలె మారితేనే కాని పరలోకరాజ్యంలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 4 కాబట్టి ఈ చిన్నపిల్లల్లా తమను తాము తగ్గించుకునేవారు పరలోకరాజ్యంలో గొప్పవారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, "పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?" అని యేసుని అడిగారు. 2 అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు, 3 "మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 4 కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.