Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 2:3-10

3 హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడును అతనితో పాటు యెరూషలేము వారంతా కలవరపడ్డారు. 4 హేరోదు రాజు ప్రజల ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులనందరిని పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు. 5 అందుకు వారు, "యూదయ దేశంలోని బేత్లెహేములో" అని చెప్పారు, "ఎందుకంటే ప్రవక్త ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంది:

6 " ‘యూదయ దేశంలోని బేత్లెహేమా,

నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు;

ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి

నీలో నుండి వస్తాడు.’2:6 మీకా 5:2,4"

7 అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయమేదో వారిని అడిగి తెలుసుకున్నాడు. 8 తర్వాత ఆయన వారితో, "మీరు వెళ్లి ఆ శిశువు కోసం జాగ్రత్తగా వెదకి మీరు అతన్ని కనుగొనగానే నాకు చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను" అని చెప్పి బేత్లెహేముకు పంపించాడు.

9 వారు రాజు మాటలు విని బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం వారి ముందు వెళ్తూ ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి ఆగింది. 10 వారు ఆ నక్షత్రాన్ని చూసి చాలా ఆనందించారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.