Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 22:17-21

OTSA Telugu Contemporary Version

17 అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పు" అని అడిగారు.

18 అయితే యేసు, వారి చెడు ఉద్దేశాన్ని గ్రహించి, వారితో, "వేషధారులారా, మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? 19 పన్నుకట్టే ఒక నాణెము నాకు చూపించండి" అన్నారు. అందుకు వారు ఒక దేనారం తెచ్చారు. 20 ఆయన వారిని, "దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?" అని అడిగారు.

21 వారు, "కైసరువి" అన్నారు.

అప్పుడు ఆయన, "అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి" అని వారితో చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    17 సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు" అని అడిగారు.

    18 యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, "కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? 19 ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి" అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు. 20 ఆయన, "దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?" అని వారినడిగాడు. వారు, "అవి సీజరు చక్రవర్తివి" అన్నారు. 21 ఆయన వెంటనే, "అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి" అని వారితో చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.