యేసు అరణ్యంలో పరీక్షించబడుట
1 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు. 2 నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలివేసింది. 3 శోధకుడు యేసు దగ్గరకు వచ్చి, "నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మారమని చెప్పు" అని అన్నాడు.
4 అందుకు యేసు, " ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’4:4 ద్వితీ 8:3 అని వ్రాయబడి ఉంది" అని జవాబిచ్చారు.
7 అందుకు యేసు అతనితో, " ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’4:7 ద్వితీ 6:16 అని కూడా వ్రాయబడి ఉంది" అని అన్నారు.
10 అందుకు యేసు, "సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది"4:10 ద్వితీ 6:13 అని చెప్పారు.
11 అపవాది ఆయనను విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.