నీనెవెకు వ్యతిరేకంగా యెహోవా కోపం
2 యెహోవా రోషం గలవారు ప్రతీకారం తీర్చుకునే దేవుడు;
యెహోవా పగ తీర్చుకునేవారు ఉగ్రత గలవారు.
యెహోవా తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు,
తన శత్రువులపై తన ఉగ్రతను వెళ్లగ్రక్కుతారు.
3 యెహోవా త్వరగా కోప్పడరు, ఆయన గొప్ప శక్తిగలవారు;
యెహోవా దోషులను శిక్షించకుండ విడిచిపెట్టరు.
ఆయన మార్గం సుడిగాలిలోనూ తుఫానులోనూ ఉంది,
మేఘాలు ఆయన పాద ధూళి.