7 యెరూషలేముకు తిరిగి వచ్చాను. దేవుని ఆలయ ఆవరణంలో టోబీయాకు గది ఏర్పాటు చేసి ఎల్యాషీబు కీడు చేశాడని నేను గ్రహించాను. 8 నాకు చాలా కోపం వచ్చి, నేను ఆ గదిలో నుండి టోబీయా వస్తువులన్నిటిని తీసి బయట పడవేశాను.
10 లేవీయులకు ఇవ్వవలసిన భాగాలు వారికి ఇవ్వలేదని, సేవ చేయవలసిన లేవీయులు, సంగీతకారులు తమ పొలాల్లో పని చేసుకోవడానికి తిరిగి వెళ్లిపోయారని నేను తెలుసుకున్నాను.
15 ఆ రోజుల్లో యూదాలో కొంతమంది విశ్రాంతి దినాన ద్రాక్షలను ద్రాక్షగానుగలో తొక్కడం, ధాన్యం, ద్రాక్షరసం, ద్రాక్షలు, అంజూర పండ్లు అన్ని రకాల మూటలు తీసుకువచ్చి గాడిదల మీద పెట్టి విశ్రాంతి దినాన యెరూషలేముకు తీసుకురావడం నేను చూశాను. కాబట్టి ఆ రోజు ఆహారం అమ్మకూడదని నేను వారిని హెచ్చరించాను.
23 అంతే కాకుండా, ఆ రోజుల్లో అష్డోదు, అమ్మోను, మోయాబులకు చెందిన స్త్రీలను పెళ్ళి చేసుకున్న యూదా పురుషులను నేను చూశాను.
31 నేను నిర్ణీత సమయాల్లో కట్టెలు, ప్రథమ ఫలాలు తెచ్చేలా ఏర్పాటు చేశాను.
నా దేవా! దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి.