పునర్నిర్మాణానికి కలిగిన మరింత వ్యతిరేకత
1 అప్పటికి నేను గుమ్మాలకు తలుపులు నిలబెట్టక పోయినప్పటికి, ఏ బీటలు లేకుండా గోడను పునర్నిర్మించానని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము, మరికొందరు మా మిగతా శత్రువులు విన్నారు. 2 సన్బల్లటు గెషెము, "రండి, మనం ఓనో సమతల మైదానంలో ఉన్న ఒక గ్రామంలో6:2 లేదా కెఫీరీము కలుసుకుందాం" అని నాకు సందేశం పంపారు.
అయితే వారు నాకు హాని చేయాలని కుట్రపన్నారు; 3 కాబట్టి నేను వారికి, "నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, దానిని విడిచిపెట్టి మీ దగ్గరకు ఎందుకు రావాలి? లేను రాలేను" అని చెప్పి దూతతో కబురు పంపాను. 4 వారదే పనిగా నాలుగు సార్లు కబురు పంపారు. నేను ప్రతిసారి అదే జవాబు ఇచ్చాను.
5 అప్పుడు అయిదవసారి సన్బల్లటు తన పనివాని చేతికి తెరిచి ఉన్న ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు. 6 దానిలో ఈ విధంగా వ్రాసి ఉంది:
"నీవు యూదులతో కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో గోడ కడుతున్నావని ప్రజల మధ్యలో వదంతి ఉంది. దానిని గెషెము నిరూపించాడు. అంతే కాకుండా దాని ప్రకారం నీవు వారికి రాజు కావాలని చూస్తున్నావు.
10 ఒక రోజు నేను మెహేతబేలుకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా ఇంటికి వెళ్లాను. అతడు ఇంట్లోనే ఉన్నాడు. అతడు, "రాత్రివేళ నిన్ను చంపడానికి వారు వస్తున్నారు కాబట్టి మనం దేవుని మందిరం దగ్గర కలుసుకొని గర్భాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుందాం" అని చెప్పాడు.
11 కాని నేను, "నాలాంటివాడు పారిపోవాలా? లేదా నా లాంటివాడు ప్రాణాలు కాపాడుకోడానికి గర్భాలయంలోకి వెళ్లి దాక్కోవాలా? నేను వెళ్లను" అన్నాను. 12 దేవుడు అతన్ని పంపించలేదని నేను గ్రహించాను. నాకు వ్యతిరేకంగా ప్రవచించడానికి టోబీయా సన్బల్లటు అతనికి లంచం ఇచ్చారు. 13 నేను భయపడి అతడు చెప్పినట్లు చేసి పాపం చేస్తే వారు నన్ను నిందించి నాకు చెడ్డ పేరు తీసుకురావాలని లంచమిచ్చి అతన్ని నియమించుకున్నారు.