Pular para o conteúdo
Publicidade

నెహెమ్యా 6:2-4,6,8,9

OTSA Telugu Contemporary Version

2 సన్బల్లటు గెషెము, "రండి, మనం ఓనో సమతల మైదానంలో ఉన్న ఒక గ్రామంలో6:2 లేదా కెఫీరీము కలుసుకుందాం" అని నాకు సందేశం పంపారు.

అయితే వారు నాకు హాని చేయాలని కుట్రపన్నారు; 3 కాబట్టి నేను వారికి, "నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, దానిని విడిచిపెట్టి మీ దగ్గరకు ఎందుకు రావాలి? లేను రాలేను" అని చెప్పి దూతతో కబురు పంపాను. 4 వారదే పనిగా నాలుగు సార్లు కబురు పంపారు. నేను ప్రతిసారి అదే జవాబు ఇచ్చాను.

6 దానిలో ఈ విధంగా వ్రాసి ఉంది:

"నీవు యూదులతో కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో గోడ కడుతున్నావని ప్రజల మధ్యలో వదంతి ఉంది. దానిని గెషెము నిరూపించాడు. అంతే కాకుండా దాని ప్రకారం నీవు వారికి రాజు కావాలని చూస్తున్నావు.

8 అప్పుడు నేను ఈ విధంగా జవాబు పంపించాను: "నీవు చెప్పినట్లుగా ఇక్కడ ఏమి జరుగలేదు; అవన్నీ మీరు ఊహించి కల్పించినవే" అని వారికి జవాబు పంపాను.

9 "వారి చేతులు పని చేసి బలహీనమైపోయి ఇక వారు ఆ పని చేయలేరు" అని భావించి వారు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు.

అయితే నేను, "ఇప్పుడు నా చేతులను బలపరచు" అని ప్రార్థించాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    2 సన్బల్లటు, గెషెంలు నాకు ఎలాగైనా కీడు తలపెట్టాలని చూశారు. "ఓనో మైదానంలో ఎదో ఒక చోట మనం కలుసుకుందాం, రండి" అని మాకు కబురు పంపారు. 3 అప్పుడు నేను "నేను చేస్తున్న పని మహత్తరమైనది. ఆ పని ఆపేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి?" అని నా మనుషులతో జవాబు పంపాను. 4 వాళ్ళు అదే విధంగా నాలుగుసార్లు నాకు కబురు పంపించారు, నేను కూడా ముందు చెప్పినట్టుగానే జవాబిచ్చాను.

    6 ఆ ఉత్తరంలో "యూదులపై రాజుగా ఉండాలని నువ్వు సరిహద్దు గోడలు కడుతున్నావు. ఆ కారణం వల్ల నువ్వు, యూదులు కలసి రాజు మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు. 8 ఇలా చేస్తే మేము బెదిరిపోయి పని చేయలేక నీరసించిపోతాం అని వాళ్ళు భావించారు. 9 "మేము ఎప్పటికీ ఇలాంటి పనులు చెయ్యం. వీటన్నిటినీ నీ మనస్సులో నువ్వే కల్పించుకున్నావు" అని అతనికి జవాబు పంపాను. దేవా, ఇప్పుడు నా చేతులకు బలమియ్యి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.