మోషేను విమర్శించిన మిర్యాము అహరోనులు
1 మోషే కూషీయురాలిని పెళ్ళి చేసుకున్నందుకు, అతనికి వ్యతిరేకంగా మిర్యాము, అహరోనులు మాట్లాడడం ప్రారంభించారు, 2 "యెహోవా కేవలం మోషే ద్వారానే మాట్లాడారా?" అని, "ఆయన మా ద్వారా కూడా మాట్లాడలేక?" అని అన్నారు. యెహోవా వారి మాటలు విన్నారు.
3 మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు.
8 అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను,
పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను.
అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు.
అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా
నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?"