Pular para o conteúdo
Publicidade

సంఖ్యా 15:37-41

OTSA Telugu Contemporary Version

వస్త్రాల మీద కుచ్చులు

37 యెహోవా మోషేతో ఇలా అన్నారు, 38 "ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘రాబోయే తరాలన్నిటిలో మీరు మీ వస్త్రాల మూలల్లో నీలం రంగు దారంతో కుచ్చులు తయారుచేయాలి. 39 ఆ కుచ్చులను చూసినప్పుడు యెహోవా ఆజ్ఞలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు, వాటికి లోబడాలని మీ హృదయాభిలాషలు మీ నేత్రాశల వెంటపడుతూ వ్యభిచరించకూడదని జ్ఞాపకం చేసుకుంటారు. 40 అప్పుడు నా ఆజ్ఞలన్నిటికి లోబడాలని జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి మీరు ప్రతిష్ఠించుకుంటారు. 41 నేను మీ దేవుడైన యెహోవానై ఉన్నాను, మీకు దేవునిగా ఉండడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను.’ "

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    37 ఇంకా యెహోవా మోషేతో మాట్లాడుతూ, 38 "నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలిరంగు దారం తగిలించాలి. 39 మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.

    40 మీరు నా కోసం ప్రత్యేకపరచిన వారు గనక, మీరు పవిత్రులుగా ఉండేందుకు యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి జాగ్రత్త తీసుకోండి. 41 నేను మీకు దేవుడుగా ఉండాలని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను నేనే."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.