2 "ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘పురుషుడు గాని స్త్రీ గాని ఒక ప్రత్యేకమైన మ్రొక్కుబడి చేయాలనుకుంటే అనగా, యెహోవాకు నాజీరుగా ప్రతిష్ఠించుకునే మ్రొక్కుబడి చేయాలనుకుంటే, 3 వారు ద్రాక్షరసం, మద్యానికి వేరుగా ఉండాలి, ద్రాక్షరసం నుండి గాని మద్యం నుండి గాని తయారుచేసిన చిరక త్రాగవద్దు. వారు ఏ ద్రాక్షరసం త్రాగకూడదు, పండు ద్రాక్షలు గాని ఎండు ద్రాక్షలు గాని తినకూడదు.
5 " ‘నాజీరుగా మ్రొక్కుబడి చేసుకున్న కాలమంతా, వారి వెంట్రుకలు కత్తిరించకూడదు. తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకున్న కాలమంతా వారు ముగిసేవరకు పవిత్రులుగా ఉండాలి; వారి వెంట్రుకలు పెరిగేలా వదిలేయాలి.
6 " ‘వారు యెహోవాకు తాము ప్రత్యేకించుకున్న కాలమంతా శవం దగ్గరకు వెళ్లకూడదు.