Pular para o conteúdo
Publicidade

సామెతలు 13

1 జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు,

కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు.

2 తమ పెదవుల ఫలం నుండి ప్రజలు మేలైన వాటిని ఆస్వాదిస్తారు,

కాని నమ్మకద్రోహులు హింస పట్ల ఆకలిగొని ఉంటారు.

3 తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు,

కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.

4 సోమరి ఆకలి ఎన్నటికి తీరదు,

కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు.

5 నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు,

దుర్మార్గులు తమను తాము దుర్గంధం చేసుకుంటారు

తమ మీదికి అవమానం తెచ్చుకుంటారు.

6 నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది,

కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.

7 కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు;

మరికొందరు బాగా ధనము కలిగి ఉండి కూడా, పేదవారిగా నటిస్తారు.

8 ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు,

కాని పేదవాడు బెదిరింపు మాటలను వినడు.

9 నీతిమంతుల వెలుగు అంతకంతకు ప్రకాశించును,

కాని దుర్మార్గుల దీపం ఆరిపోతుంది.

10 గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది,

కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది.

11 నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది,

కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.

12 వాయిదా వేయబడిన ఆశ హృదయానికి జబ్బు కలిగిస్తుంది,

అయితే కోరిక తీరుట జీవవృక్షము.

13 బోధను ఎగతాళి చేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు,

కాని ఆజ్ఞను గౌరవించేవారు ఫలం పొందుతారు.

14 జ్ఞానుల బోధ ఒక జీవపుఊట,

అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.

15 మంచి తీర్పు దయను గెలుస్తుంది,

కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది.

16 వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు,

కాని మూర్ఖులు వారి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తారు.

17 దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు,

నమ్మకమైన రాయబారులు స్వస్థత కలిగిస్తారు.

18 శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి

అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు.

19 ఆశ తీరుట వలన ప్రాణానికి తీపి

చెడుతనాన్ని విడిచిపెట్టడం బుద్ధిలేనివారికి అసహ్యము.

20 జ్ఞానులతో స్నేహం చేసేవారు జ్ఞానులవుతారు

బుద్ధిలేనివారితో స్నేహం చేసేవారు చెడిపోతారు.

21 కష్టం పాపులను వెంటాడుతుంది,

నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును.

22 మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు,

పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది.

23 దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది

కాని అన్యాయస్థులు రు.

24 బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి

కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు.

25 నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు,

కానీ దుష్టులైన వారి కడుపు నిండదు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.