Pular para o conteúdo
Publicidade

సామెతలు 16:1-3,9,25,33

OTSA Telugu Contemporary Version

1 హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి,

కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది.

2 ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి,

అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.

3 మీ పనులను యెహోవాకు అప్పగించండి,

మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి.

9 మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు,

యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు.

25 ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది,

అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.

33 చీట్లు ఒడిలో వేయబడవచ్చు,

కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.

    2 ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు.

    3 నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.

    9 ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.

    25 ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది.

    33 చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.