Pular para o conteúdo
Publicidade

సామెతలు 31:10,13-18,20,24

10 31:10 31:10-31 వచనాలు ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు?

ఆమె ముత్యాల కంటే విలువైనది.

13 ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని,

ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.

14 ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే,

వర్తకుల ఓడల లాంటిది.

15 ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది;

తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది;

తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది.

16 ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది;

తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది.

17 ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది,

ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి.

18 ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది,

రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.

20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది,

దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.

24 ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది,

వర్తకులకు నడికట్లను అమ్ముతుంది.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.