11 ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు
అతనికి లాభం తక్కువకాదు.
13 ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని,
ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.
15 ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది;
తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది;
తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది.
16 ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది;
తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది.
17 ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది,
ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి.
20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది,
దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.
26 ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది,
దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.
27 ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది,
పని చేయకుండ ఆమె భోజనం చేయదు.