Pular para o conteúdo
Publicidade

సామెతలు 31:25-30

OTSA Telugu Contemporary Version

25 బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది;

ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు.

26 ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది,

దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.

27 ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది,

పని చేయకుండ ఆమె భోజనం చేయదు.

28 ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు;

ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు:

29 "చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు,

కాని వారందరినీ నీవు మించినదానవు."

30 అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం;

యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    25 బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది.

    26 ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది.

    27 ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు.

    28 ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు.

    29 "చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు" అంటాడు.

    30 చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.