Pular para o conteúdo
Publicidade

సామెతలు 4:1-6

OTSA Telugu Contemporary Version

ఎలాగైనా జ్ఞానం సంపాదించండి

1 నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి;

వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి.

2 మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను,

కాబట్టి నా బోధను త్రోసివేయకండి.

3 నేను కూడా నా తండ్రికి కుమారుడను,

నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను.

4 నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే,

"నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో;

నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు.

5 జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో;

నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు.

6 నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది;

నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి.

    2 నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి.

    3 నేను నా తండ్రి కుమారుణ్ణి. నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి.

    4 ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు "నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు. వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు.

    5 జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు.

    6 జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.