Pular para o conteúdo
Publicidade

సామెతలు 6:32-35

OTSA Telugu Contemporary Version

32 అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు;

అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.

33 దెబ్బలు, అవమానం వాని భాగం,

వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.

34 ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది,

ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.

35 అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు;

ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    32 వ్యభిచారం చేసేవాడు కేవలం బుద్ధి లేనివాడు. ఆ పని చేసేవాడు తన సొంత నాశనం కోరుకున్నట్టే.

    33 వాడు గాయాలకు, అవమానాలకు గురి అవుతాడు. వాడికి కలిగే అవమానం ఎప్పటికీ తొలగిపోదు.

    34 భర్తకు వచ్చే రోషం తీవ్రమైన కోపంతో కూడి ఉంటుంది. ప్రతీకారం చేసే సమయంలో అతడు కనికరం చూపించడు.

    35 ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇచ్చే దేనినీ అతడు లక్ష్యపెట్టడు. ఎన్ని విలువైన కానుకలు ఇచ్చినా అతడు తీసుకోడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.