Pular para o conteúdo
Publicidade

సామెతలు 8:1,10-13,32-36

జ్ఞానం యొక్క ప్రకటన

1 జ్ఞానం ప్రకటించడం లేదా?

తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా?

10 వెండికి ఆశపడక నేను చెప్పు మాటలను అంగీకరించండి,

మేలిమి బంగారానికి ఆశపడక తెలివిని సంపాదించండి.

11 జ్ఞానం, ముత్యాల కంటే శ్రేష్ఠమైనది,

విలువగల వస్తువులు ఏమియు దానితో సరికావు.

12 "నేను, జ్ఞానం, వివేకంతో కలిసి నివసిస్తాను;

నాకు జ్ఞానం, విచక్షణ ఉన్నాయి.

13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే;

గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట,

అబద్ధపు మాటలు నాకు అసహ్యము.

32 "కాబట్టి పిల్లలారా, నా మాట వినండి;

నా దారిని అనుసరించేవారు ధన్యులు.

33 నా ఉపదేశాన్ని విని జ్ఞానం గలవారిగా ఉండండి;

దానిని నిర్లక్ష్యం చేయకండి.

34 ప్రతిదినం నా గడప దగ్గర కనిపెట్టుకొని,

నా వాకిటి దగ్గర కాచుకుని

నా బోధను వినే మనుష్యులు ధన్యులు.

35 నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు,

వారు యెహోవా దయ పొందుకుంటారు.

36 నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకుంటాడు;

నేనంటే అసహ్యపడేవాడు మరణాన్ని ప్రేమించినవాడు."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.