Pular para o conteúdo
Publicidade

రోమా పత్రిక 11:33-36

OTSA Telugu Contemporary Version

దేవుని కీర్తించుట

33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంతో లోతైనది!

ఆయన తీర్పులు ఎంతో నిగూఢమైనవి,

ఆయన మార్గాలు మన ఊహకు అందనివి!

34 "ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు?

ఆయనకు ఆలోచన చెప్పగలవారెవరు?"11:34 యెషయా 40:13

35 "ముందుగానే దేవునికి ఇచ్చి

ఆయన నుండి తిరిగి పొందగలవారు ఎవరు?"11:35 యోబు 41:11

36 ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే సమస్తం ఉన్నాయి

కాబట్టి ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    33 ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.

    34 "ప్రభువు మనసు తెలిసిన వాడెవడు?

    ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?

    35 ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?"

    36 సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్‌.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.