Pular para o conteúdo
Publicidade

రోమా పత్రిక 15:8-13

OTSA Telugu Contemporary Version

8,9 పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:

"కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను.

నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను."15:9 2 సమూ 22:50; కీర్తన 18:49

10 అలాగే మరొక చోట,

"యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి."15:10 ద్వితీ 32:43

11 మరియొక చోట,

"యూదేతరులారా, ప్రభువును స్తుతించండి;

సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక."15:11 కీర్తన 117:1

12 మరోచోట యెషయా ఇలా చెప్పాడు,

"యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది

అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు,

యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటారు."15:12 యెషయా 11:10

13 పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు. 9 దీని గురించి,

    "ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను.

    నీ నామ సంకీర్తనం చేస్తాను" అని రాసి ఉంది.

    10 ఇంకా ఏమని ఉన్నదంటే,

    "యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి" అనీ,

    11 "యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు."

    12 యెషయా ఇలా అన్నాడు,

    "యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు.

    ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు."

    13 మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.