Pular para o conteúdo
Publicidade

రోమా పత్రిక 6:12-18

12 కాబట్టి మీ శరీర దురాశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి. 13 దుష్టత్వానికి పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి అప్పగించవద్దు. అయితే మరణం నుండి జీవంలోనికి తీసుకురాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించాలి. 14 మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు కాని, కృప కలిగి ఉన్నారు కాబట్టి ఇకమీదట పాపం మీమీద అధికారాన్ని కలిగి ఉండదు.

నీతికి దాసులు

15 అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు! 16 మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేదా నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా? 17 ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికీ, ఏ ఉపదేశానికైతే మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి మీరు హృదయమంతటితో లోబడ్డారు. కాబట్టి దేవునికి వందనాలు. 18 మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.